: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9 వరకే


తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఒకరోజు కోత పడింది. అంటే ఒకరోజు ముందుగానే సమావేశాలు ముగుస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10 వరకు సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే ఈ నెల 9వ తేదీ వరకే సమావేశాలు జరగనున్నట్టు తెలిసింది. శాసనసభ నుంచి మజ్లిస్ మినహా విపక్ష సభ్యులందరినీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. రైతు రుణమాఫీ ఒకేసారి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఈ నెల 9వరకు ప్రభుత్వానికి గడువిచ్చాయి. ఆ లోపు సర్కార్ స్పందించకపోతే 10వ తేదీన తెలంగాణ బంద్ కు పిలుపునిస్తామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాల కుదింపు జరిగినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News