Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

21 అంశాల వైఫల్యాలను ఎండగడతాం: ఎర్రబెల్లి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని టీటీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రధానంగా 21 అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని అన్నారు. కనీసం 15 రోజులపాటైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఆయన కోరారు. తెలంగాణలో 1400 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారందరికీ న్యాయం జరగాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతుల ఆత్మహత్యలను పెంచే విధంగా ఉన్నాయే తప్ప నివారించేవిగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను పరిహారమిచ్చి ఆదుకోవాలని ఆయన సూచించారు.

More Telugu News