Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాహుబలి, గబ్బర్ సింగ్, సిక్స్ ప్యాక్... ఈ వినాయకులు ఏంటి?: మండిపడ్డ సాధు పరిషత్

వినాయక చవితి ఉత్సవాలు ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. వివిధ రకాల వినాయకులు భక్తుల పూజలు అందుకుంటున్నారు. అయితే, కొంత మంది ఔత్సాహికులు తమ క్రియేటివిటీ చూపించి, వినాయకుడిని వివిధ వేషాల్లో ఏర్పాటు చేశారు. దీనిపై ఉత్తరాంధ్ర సాధు పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవుడిని దేవుడిగా చూడాలే తప్ప, విందు వినోదాల కోసం కాదని మండిపడింది. బాహుబలి, గబ్బర్ సింగ్, సిక్స్ ప్యాక్ వినాయకుడు... ఏమిటి ఇదంతా? అని సాధువు శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించారు. ఇంతకంటే అపరాధం, పాపం ఉంటుందా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయడం వినాయకుడిని అగౌరవపరచడం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News