Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అసలు అమ్మాయిలు రాత్రుళ్లు ఎందుకు తిరగాలి?: కేంద్ర మంత్రి మహేష్ శర్మ

ఇటీవలే మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాంపై వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖా మంత్రి మహేష్ శర్మ, మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో అమ్మాయిలు రాత్రి పూట తిరగడం మన సంప్రదాయాలకు విరుద్ధమని ఆయన అన్నారు. "అమ్మాయిలు రాత్రిపూట తిరగడం ఇంకెక్కడైనా సరైనదే కావచ్చు. కానీ, భారత సంస్కృతిలో మాత్రం అది భాగం కాదు" అని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. అసలు రాత్రుళ్లు యువతులు ఎందుకు రోడ్లపై తిరగాలని ఆయన ప్రశ్నించారు. జైనుల పండగ సందర్భంగా, వారిని గౌరవించేలా కొద్ది రోజులు మాంసానికి దూరమైతే తప్పేంటని కూడా ఆయన ప్రశ్నించారు. రెండు రోజుల పాటు త్యాగం చేయలేరా? అని అడిగారు. ఆర్ఎస్ఎస్ తో సుదీర్ఘ అనుబంధమున్న మనీష్ శర్మ తాజా వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News