Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలోకి మానవబాంబులను పంపుతాం... 9/11 పునరావృతం చేస్తాం: ఐఎస్

అమెరికానే కాకుండా ప్రపంచాన్నే వణికించిన 9/11 తరహా దాడులను పునరావృతం చేస్తామని ఐఎస్ఐఎస్ హెచ్చరించింది. మానవబాంబులను, పేలుడు పదార్థాలు నింపిన కార్లను అమెరికాలోకి పంపుతామని తాజాగా విడుదల చేసిన వీడియోలో ఉగ్రవాదులు హెచ్చరించారు. ప్రపంచంలోని జీహాదీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. 'అల్లా సైనికులంతా సిద్ధంగా ఉన్నాం' అనే మార్చింగ్ సాంగ్ లో ఉగ్రవాదులంతా జీపుల్లో వెళుతున్న సన్నివేశాలు కూడా వీడియోలో ఉన్నాయి. అలాగే, వెనకాల వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోతుంటే... ముందు కూర్చొని ఒసామా బిన్ లాడెన్ అమెరికాను హెచ్చరించిన దృశ్యాలు కూడా వీడియోలో పొందుపరిచారు. అమెరికన్లను, క్రీస్టియన్లను, యూదులను ప్రపంచంలోని ముస్లింలంతా ద్వేషించే రోజులు వస్తాయని కూడా టెర్రరిస్టులు అన్నారు.

More Telugu News