యుద్ధం వస్తే భారత్ కు భారీ నష్టం తప్పదు ... పాక్ మంత్రి ఆసిఫ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యుద్ధం వస్తే భారత్ కు భారీ నష్టం తప్పదు ... పాక్ మంత్రి ఆసిఫ్

భారత్ తో ఎటువంటి యుద్ధానికైనా సరే, తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అన్నారు. భారత నేతలకు యుద్ధోన్మాదం తలకెక్కితే ఆ దేశం భారీ నష్టాన్ని చవిచూడాల్సివస్తుందని ఆసిఫ్ వ్యాఖ్యానించారు. రేడియో పాకిస్థాన్ కార్యక్రమంలో ఆసిఫ్ పాల్గొన్నారు. శాంతి స్థాపనపై తమకు నమ్మకం ఉందని, అయితే దురుసుగా వ్యవహరిస్తే ఏవిధంగా సమాధానం చెప్పాలో కూడా తమకు తెలుసని ఆసిఫ్ హెచ్చరించారు. కాగా, భవిష్యత్ లో చిన్నాచితక యుద్ధాలు రావచ్చని సైన్యం సిద్ధంగా ఉండాలంటూ ఇటీవల భారత ఆర్మీచీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు విదితమే. ఈ నేపథ్యంలో పాక్ మంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం.

More Telugu News