విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం... అరెస్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం... అరెస్టు

విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాల నేతలు చేసిన ప్రయత్నం విఫలమైంది. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుపై ఈ రోజు కేబినెట్ భేటీలో ప్రభుత్వం చర్చిస్తోంది. దానికి నిరసనగా పలు విద్యార్థి సంఘాలు క్యాంపు కార్యాలయం వద్ద నిరసన చేసేందుకు వచ్చారు. వెంటనే వారిని పోలీసులు అడ్డుకుని పలువురిని అరెస్టు చేశారు. పోలీసుల చర్యలను విద్యార్థులు తీవ్రంగా ఖండిస్తున్నారు.

More Telugu News