: విజయవాడ పరిధిలోని 264 గ్రామాల అభివృద్ధికి టాటా ట్రస్ట్ ప్రణాళిక: ఎంపీ నాని
విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 264 గ్రామాల అభివృద్ధికి టాటా ట్రస్ట్ ప్రణాళికను రూపొందించినట్టు నియోజకవర్గ ఎంపీ కేశినేని నాని తెలిపారు. ఈ నెల 24న సీఎం చంద్రబాబు, టాటా ట్రస్ట్ ఛైర్మన్ రతన్ టాటా కలసి ఈ ప్రణాళికను విడుదల చేస్తారని ఆయన చెప్పారు. అప్పుడే మరిన్ని విషయాలను వెల్లడిస్తామన్నారు. దేశంలోనే తొలిసారిగా టాటా ట్రస్ట్ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంది. ఇందుకు ఎంపీ నాని తీవ్ర కృషి చేసిన సంగతి తెలిసిందే. ఎల్లుండి జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు రేపు టాటా విజయవాడ వస్తారని, సీఎంతో సమావేశమవుతారని ఆయన చెప్పారు.