: చైనాలో పేలుడు... టాటా మోటార్స్ కు చెందిన వేల కార్లు ధ్వంసం

చైనాలో జరిగిన భారీ పేలుడు కారణంగా భారత కార్పొరేట్ దిగ్గజం టాటా మోటార్స్ కు కోట్లాది నష్టం వాటిల్లింది. ఆ వివరాల్లోకి వెళితే, భారత భూభాగంపై తయారైన ల్యాండ్ రోవర్ కార్లను చైనాలో విక్రయించేందుకు టాటా మోటార్స్ ఆ దేశానికి తరలించింది. చైనాలోని టియాంజిన్ లో దాదాపు 5,800 కార్లను నిల్వ చేసింది. అయితే ఆ ప్రాంతంలో సంభవించిన శక్తిమంతమైన పేలుడు కారణంగా ఈ కార్లన్నీ ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో టాటా మోటార్స్ కు 600 మిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. ఈ ఘటన జరిగిన తీరుపై పూర్తి వివరాలు తెలియరాలేదు.

More Telugu News