ఒకేసారి నలుగురు రేప్ చేయడం ఎలా సాధ్యం?: ములాయం వివాదాస్పద వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒకేసారి నలుగురు రేప్ చేయడం ఎలా సాధ్యం?: ములాయం వివాదాస్పద వ్యాఖ్యలు

సమాజ్ వాది పార్టీ అధినేత, సీనియర్ పొలిటీషియన్ ములాయం సింగ్ యాదవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుటుంబంలో ఒక్కరు రేప్ చేస్తే, నలుగురు చేసినట్టు చూపుతున్నారని మండిపడ్డారు. ఒకేసారి నలుగురు అత్యాచారం చేయడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. ప్రాక్టికల్ గా ఆలోచించడంటూ హితవు కూడా పలికారు. అసలు ఉత్తరప్రదేశ్ లో అత్యాచారాలు చాలా తక్కువగా జరుగుతాయని... మధ్యప్రదేశ్ లోనే అత్యాచారాలు ఎక్కువని... కానీ, మీడియానే కావాలని ఉత్తరప్రదేశ్ ను ఎక్కువ చేసి చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ములాయం చేసిన ఈ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

More Telugu News