ఇక 4జీ పోరు షురూ...‘జియో’కు దీటుగా రూ.4 వేలకే ఎయిర్ టెల్ 4జీ స్మార్ట్ ఫోన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇక 4జీ పోరు షురూ...‘జియో’కు దీటుగా రూ.4 వేలకే ఎయిర్ టెల్ 4జీ స్మార్ట్ ఫోన్!

3జీ సేవల పోరు ముగిసింది. ఇక 4జీ పోరు షురూ కానుంది. 4జీ సేవలను ప్రారంభించేందుకు ఇప్పటికే ముఖేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ గ్రూప్ ‘రిలయన్స్ జియో’ పేరిట భారీ సన్నాహాలు చేస్తోంది. వినూత్న ప్లాన్లతో 4జీ వ్యాపారంలో సింహభాగాన్ని చేజిక్కించుకునేందుకు రిలయన్స్ పక్కా ప్రణాళికలు రచించింది. అయితే ఇప్పటిదాకా మొబైల్ సర్వీసుల్లో దేశంలోనే నెంబర్ వన్ గా కొనసాగుతూ వస్తున్న ఎయిర్ టెల్ కూడా దాదాపుగా రంగంలోకి దిగేసింది. రిలయన్స్ జియోకు దీటుగా భారీ ఆకర్షణీయ పథకాలకు రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా కేవలం రూ.4 వేలకే 4జీ స్మార్ట్ ఫోన్ ను అందించేందుకు సన్నాహాలు జరుపుతోంది. ఇప్పటికే చైనాకు చెందిన పలు సంస్థలతో సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్ టెల్ మాట్లాడిందట. వీలయినంత త్వరలో తన 4జీ ప్లాన్ లను విడుదల చేసేందుకు ఎయిర్ టెల్ రంగం సిద్ధం చేసుకుంటోంది.

More Telugu News