మునిసిపల్ కార్మికుల సమ్మె ఎఫెక్ట్... కంపు కొడుతున్న నగరాలు, పట్టణాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మునిసిపల్ కార్మికుల సమ్మె ఎఫెక్ట్... కంపు కొడుతున్న నగరాలు, పట్టణాలు

తెలంగాణలో మునిసిపల్ కార్మికుల సమ్మె నేటితో ఎనిమిదో రోజుకు చేరుకుంది. అదే సమయంలో ఏపీలోనూ వీరి సమ్మె నాలుగో రోజుకు చేరింది. సర్వీసులను క్రమబద్ధీకరించడంతో పాటు వేతనాల పెంపు సహా 17 డిమాండ్లతో సమ్మెకు దిగిన కార్మికులు, డిమాండ్లు నెరవేరే దాకా సమ్మె విరమించేది లేదని తేల్చిచెబుతున్నారు. కార్మికులతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇదిలా ఉంటే, సమ్మె చేస్తున్న కార్మికుల్లో పారిశుద్ధ్య సిబ్బందే అధికంగా ఉన్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో ఆయా నగరాలు, పట్టణాలు కంపుకొడుతున్నాయి. దుర్గంధంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

More Telugu News