ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా ఖాకీ చొక్కానే వేస్తా!: భూమా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కర్నూలు ఎస్పీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా ఖాకీ చొక్కానే వేస్తా!: భూమా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కర్నూలు ఎస్పీ

పచ్చ చొక్కా వేసుకుని నాపై పోటీ చేయ్... నువ్వో, నేనో తేల్చుకుందామన్న వైకాపా నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వ్యాఖ్యల పట్ల కర్నూలు ఎస్పీ తీవ్రంగా ప్రతిస్పందించారు. భూమా నాగిరెడ్డి గతంలో ఎన్నో పార్టీలు మారారని... అలాంటి వ్యక్తి ఎలాంటి చొక్కాలు వేసుకోవాలో తనకు చెప్పాల్సిన అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ చొక్కా వేసుకోవాలో తనకు రాజ్యాంగం తెలిపిందని అన్నారు. ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా ఖాకీ చొక్కానే వేసుకుంటానని ఘాటుగా వ్యాఖ్యానించారు. నంద్యాలలో జరిగిన ఘటన ఆధారంగానే భూమాపై కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు. జిల్లాలో ఫ్యాక్షన్, రౌడీయిజాన్ని అంతమొందిస్తామని చెప్పారు.

More Telugu News