ఓ వైపు సుప్రీంకోర్టు నోటీసులిస్తే, మరోవైపు పార్టీ చేసుకుంటున్న మధ్యప్రదేశ్ గవర్నర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓ వైపు సుప్రీంకోర్టు నోటీసులిస్తే, మరోవైపు పార్టీ చేసుకుంటున్న మధ్యప్రదేశ్ గవర్నర్

సంచలనం సృష్టించిన వ్యాపమ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ గవర్నర్ రాంనరేష్ యాదవ్ కు సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. ఈ కేసులో విచారణను సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. యాదవ్ మాత్రం ఈ నోటీసుల పట్ల పెద్దగా స్పందించలేదు. విచారణలో అంతా తేలుతుందన్న ఆయన నేడు రాజకీయ నాయకులు, అధికారులు, ప్రముఖులకు ఇఫ్తార్ విందు ఇచ్చే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు అందరికీ ఆహ్వానాలు పంపారు. కాగా, ఈ విందుకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరుకావడం లేదని తెలుస్తోంది. సీబీఐ విచారణను తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని, సుప్రీం ఆదేశాలతో తమ గుండె బరువు దిగిపోయినట్లు అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

More Telugu News