: పవన్ కల్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే మాతో చేయి కలపాలి: సీపీఐ
ఓటుకు నోటు అంశంపై ఎట్టకేలకు నోరు విప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్ని విషయాలపై మాట్లాడలేదని సీపీఐ ఏపీ నేత రామకృష్ణ అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నేతల అవినీతిపై పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారని... అయితే, ఎన్నికల్లో ఆయన మద్దతిచ్చిన వారే ఇప్పుడు అవినీతిలో కూరుకుపోయారని తెలిపారు. పవన్ కల్యాన్ కు చిత్తశుద్ధి ఉంటే తమతో కలసి పోరాడాలని పిలుపునిచ్చారు.