Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బుచ్చయ్యచౌదరిని మహారాష్ట్ర మంత్రితో పోల్చిన హర్షకుమార్

రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఓ విషయంలో మహారాష్ట్ర మంత్రి పంకజ్ ముండేతో పోల్చారు మాజీ ఎంపీ హర్షకుమార్. మహారాష్ట్రలో నామినేటెడ్ పధ్ధతిపై టెండర్లు ఇచ్చి కోట్ల స్కాంలో ఆమె ఇరుక్కున్నట్టుగా.... బుచ్చయ్య కూడా ముండే బాటలోనే పయనిస్తున్నారని ఆరోపించారు. పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలోని వివిధ పనులను నామినేషన్ పధ్ధతిలో కేటాయిస్తున్నారని, వాటిలో భారీగా అవినీతి జరుగుతోందని అన్నారు. కోట్ల విలువైన సుందరీకరణ పనులను నామినేషన్ పధ్ధతిలో ఎలా చేపడతారని హర్షకుమార్ ప్రశ్నించారు. రాజమండ్రిలో క్రైస్తవులకు ప్రత్యేక శ్మశాన వాటిక ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ప్రకటన చేయాలని, లేకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు.

More Telugu News