10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్

చైనా కేంద్రంగా స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తున్న ఓకికెల్ 'కే 10000' పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తోంది. దీనిలో 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటమే దీని స్పెషాలిటీ. శాంసంగ్ గెలాక్సీ నోట్-4లో వాడిన బ్యాటరీతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. స్మార్ట్ ఫోన్లలో వాడుతున్న 2000, 3000 ఎంఏహెచ్ బ్యాటరీలు త్వరగా చార్జింగ్ అయిపోతున్నాయని వస్తున్న ఫిర్యాదులకు ఈ ఫోన్ చెక్ పెడుతుందని సంస్థ చెబుతోంది. ఇప్పటివరకూ స్మార్ట్ ఫోన్లలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన జియోనీ మారథాన్ ఎం5 అత్యధిక కాలం పాటు చార్జింగ్ నిలిచివుండే ఫోన్ గా ఉంది. దానికన్నా మరో 4000 ఎంఏహెచ్ అధిక సామర్థ్యమున్న బ్యాటరీని ఇందులో వాడినట్టు సంస్థ తెలిపింది. క్వాడ్ కోర్ ప్రాసెసర్, 5.5 అంగుళాల హెచ్డీ స్క్రీన్, 16 జిబి మెమొరీ, 13 ఎంపీ, 5 ఎంపీ కెమెరాలు ఇందులో ఉన్నాయి. దీని ధర వివరాలు మాత్రం సంస్థ ఇంకా వెల్లడించలేదు.

More Telugu News