: అమిత్ షాకు ముస్లిం టీచర్ యోగా పాఠాలు

ఈ నెల 21న 'ఇంటర్నేషనల్ యోగా డే'ను దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా... ఓ ముస్లిం ఉపాధ్యాయుడి నుంచి ఆ రోజున యోగా పాఠాలు నేర్చుకోనున్నారు. "యోగా నిపుణులు మొహమ్మద్ తమన్నా, అశోక్ సర్కార్ లు అమిత్ షాకు పాట్నాలోని మొనుల్ హక్ స్టేడియంలో యోగాసనాలు నేర్పిస్తారు" అని బీహార్-జార్ఖండ్ పతంజలి యోగాపీఠ్ ఇన్ ఛార్జ్ అజిత్ కుమార్ తెలిపారు. అంతేగాక, కొన్ని యోగా చిట్కాలను కూడా షాకు నిపుణుడు తమన్నా తెలపనున్నారని చెప్పారు. కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, రాజీవ్ ప్రతాప్ రూఢీ, రాధా మోహన్ సింగ్, రామ్ క్రిపాల్ యాదవ్ లు కూడా యోగా క్యాంప్ లో పాల్గొననున్నారు.

More Telugu News