Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైకోర్టునే ఆశ్రయించండి... పోలవరం నిర్వాసితులకు సుప్రీంకోర్టు సూచన

పోలవరం నిర్వాసితులకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల తాము జీవనాధారం కోల్పోతున్నామని చెబుతూ వస్తున్న నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని సుప్రీంకోర్టు గడప తొక్కారు. ఈ పిటిషన్ పై కొద్దిసేపటి క్రితం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ వివాదాన్ని రాష్ట్ర స్థాయిలోనే పరిష్కంచుకోవాలని సూచించింది. ఈ మేరకు హైకోర్టుకే వెళ్లాలని పిటిషనర్లకు సూచిస్తూ నిర్వాసితుల పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో నిర్వాసితులు తిరిగి హైకోర్టునే ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది.

More Telugu News