: బలమైన గాయం కారణంగా విరిగిన భువనేశ్వరి మణికట్టు ఎముక... ఆసుపత్రి చేరుకున్న చంద్రబాబు


ఈ ఉదయం ట్రెడ్ మిల్ పై జాగింగ్ చేస్తూ పడిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మణికట్టు ఎముక విరిగినట్టు తెలుస్తోంది. పట్టుతప్పి ఆమె కిందపడిపోతున్న సమయంలో ఆసరా కోసం మణికట్టును నేలపై ఆనించాల్సి వచ్చిందని, ఈ నేపథ్యంలో అక్కడి ఎముకకు స్వల్ప చీలిక ఏర్పడిందని అపోలో వైద్య వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట సమయంలో సర్జరీ చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, చంద్రబాబు అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. భువనేశ్వరి పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. ఆమె సోదరుడు హరికృష్ణ ఫోన్లో పరామర్శించారు.

  • Loading...

More Telugu News