ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపిన జగన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపిన జగన్

ఆర్టీసీ సమ్మెకు తాము పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నామని వైకాపా అధినేత జగన్ తెలిపారు. ఈ రోజు ఆర్టీసీ సంఘాల నేతలు కొంతమంది జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా, తాము సమ్మె ఎందుకు చేస్తున్నామన్న విషయాన్ని వివరించారు. వారు చెప్పిందంతా విన్న తర్వాత ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న దాన్లో తప్పు లేదని... ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన ప్రభుత్వం... ఆర్టీసీ కార్మికులకు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని జగన్ ప్రశ్నించారు.

More Telugu News