శేషాచలం ఎన్ కౌంటర్ పై విచారణ వాయిదా... ఏపీ డీజీపీకి కోర్టు నోటీసు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శేషాచలం ఎన్ కౌంటర్ పై విచారణ వాయిదా... ఏపీ డీజీపీకి కోర్టు నోటీసు

చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం ఎన్ కౌంటర్ పై హైకోర్టు విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. అయితే ఎన్ కౌంటర్ ఘటనపై ఈ నెల 10లోగా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ ఏపీ డీజీపీ జేవీ రాముడుకు నోటీసు ఇచ్చింది. ఈ ఘటనపై ఈరోజు దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఇందులో ఏపీ ప్రభుత్వం, డీజీపీ, స్పెషల్ ఆపరేషన్స్ డీజీలను పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు.

More Telugu News