Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆదర్శ్ స్కాంలో అశోక్ చవాన్ కు ఎదురుదెబ్బ

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ కు ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కాంలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు ఛార్జిషీటులో గతంలో తన పేరు తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వును రీకాల్ చేయాలంటూ చవాన్ దాఖలుచేసిన పిటిషన్ ను ముంబయి హైకోర్టు తిరస్కరించింది. పేరు తొలగించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దాంతో ఈ కేసులో చవాన్ నిందితుడిగా కొనసాగనున్నారు. 2010లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ స్కాం బయటపడగా, ఆరోపణలతో ముఖ్యమంత్రిగా ఉన్న చవాన్ రాజీనామా చేశారు.

More Telugu News