మెట్రో నగరాల మధ్య రైళ్ల వేగం పెంపు... ఢిల్లీ-ముంబయి మధ్య ప్రయాణం ఒక్క రాత్రే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెట్రో నగరాల మధ్య రైళ్ల వేగం పెంపు... ఢిల్లీ-ముంబయి మధ్య ప్రయాణం ఒక్క రాత్రే

దేశంలోని మెట్రో నగరాల మధ్య రైళ్ల వేగం పెంచుతున్నట్టు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. గంటకు 200 కిలోమీటర్ల వరకు వేగం పెంచుతున్నట్టు చెప్పారు. ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు తొమ్మిది రైల్వే కారిడార్లలో మెట్రో నగరాల మధ్య రైళ్ల వేగం పెంచుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం గంటలకు 110 కిలోమీటర్ల ఉన్న చోట 160 కిలోమీటర్లకు, 130 నుంచి 200 కి.మీల వరకు పెంచినట్టు వివరించారు. దాంతో ఢిల్లీ-కోల్ కతా, ఢిల్లీ-ముంబయిల మధ్య ప్రయాణం ఒక్క రాత్రిలో పూర్తవుతుందని పేర్కొన్నారు.

More Telugu News