: ఉద్యోగాల పేరిట టోకరా...2 కోట్లు వసూలు
అక్రమార్జనే ధ్యేయంగా నేరప్రవృత్తి పెరిగిపోతోంది. ధనార్జనే ధ్యేయంగా మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నిలువునా ముంచిన ఓ ఘరానా మోసగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లోని నిరుద్యోగుల నుంచి సుమారు 2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. నిందితుడిని బాధితులు ఉద్యోగాల కోసం ప్రశ్నించడంతో, వారిపై ఎదురుతిరిగినట్టు సమాచారం. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.