: నిర్మాణంలో ఉన్న భవనం కూలి 12 మంది మృతి
నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలగా, 12 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దుల్హిపూర్ ప్రాంతంలో జరిగింది. నిర్మాణ పనులు కొనసాగుతుండగా ఒక్కసారిగా భవనం కూలి పోయింది. దీంతో 12మంది మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయినట్టు తెలిసింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.