కోదండరామయ్యకు సీఎం పట్టు వస్త్రాల సమర్పణ
భద్రాద్రి రామునికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కొద్ది సేపటి క్రితమే ఆయన ఖమ్మం జిల్లా భద్రాచలం చేరుకున్నారు. సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని ఆయన సర్కారు తరుపున విశిష్ట కానుకలను అందజేశారు. అనంతరం జగదభిరాముని దర్శించుకుని ఆశీస్సులందుకున్నారు. సీఎం వెంట రాముని దర్శించుకున్నవారిలో మంత్రులు సి. రామచంద్రయ్య, పితాని సత్యనారాయణ, రాంరెడ్డి వెంకటరెడ్డి తదితరులున్నారు.