Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మావోయిస్టు నేత దుబాసి శంకర్ భార్య అరెస్ట్... కోర్టులో హాజరుపరచాలన్న దుబ్బాక ఎమ్మెల్యే!

మావోయిస్టు కీలక నేత దుబాసి శంకర్ భార్య భారతిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. నిన్న హైదరాబాదులోని మెహిదీపట్నం పరిధిలోని ఓ ఆస్పత్రికి వచ్చిన ఆమెను పోలీసులు వలపన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దుబాసి శంకర్ ఆచూకీ గురించి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై పోలీసులు నోరు మెదపడం లేదు. మరోవైపు భారతి అరెస్టును ధ్రువీకరించుకున్న విరసం నేతలు వరవరరావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆమెను కోర్టులో హాజరుపరచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News