కొనసాగిన లాభం... అర శాతం పెరిగిన మార్కెట్ వృద్ధి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొనసాగిన లాభం... అర శాతం పెరిగిన మార్కెట్ వృద్ధి

భారత స్టాక్ మార్కెట్ లాభాలు కొనసాగాయి. తగ్గిన రేపో రేటు, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం తదితర కారణాలతో పాటు ఎఫ్ఐఐలు, ఇటు దేశవాళీ ఫండ్ సంస్థల నుంచి పెట్టుబడులు తరలి రావడంతో మార్కెట్ లాభాల్లో నిలిచింది. బీఎస్ఈ సెన్సెక్స్ సూచి 140.12 పాయింట్లు పెరిగి 0.50 శాతం లాభంతో 28,262.01 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచి 36.90 పాయింట్ల వృద్ధితో 0.43 శాతం పెరిగి 8,550.70 పాయింట్ల వద్ద స్థిరపడింది. బీఎస్ ఈలో మిడ్ కాప్ 0.45 శాతం, స్మాల్ కాప్ 0.80 శాతం పెరిగాయి. విప్రో, గెయిల్, యాక్సిస్ బ్యాంక్, బీహెచ్ఈఎల్, టాటా మోటార్స్ తదితర కంపెనీలు లాభపడగా, హీరో మోటోకార్ప్, హిందూస్తాన్ యూనిలివర్ తదితర కంపెనీలు నష్టపోయాయి.

More Telugu News