డెవిల్స్ ముందు అగ్ని పరీక్ష
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డెవిల్స్ ముందు అగ్ని పరీక్ష

ఢిల్లీ డేర్ డెవిల్స్.. ఐపీఎల్-6 లో ఇప్పటివరకు ఒక్కమ్యాచ్ కూడా నెగ్గని ఏకైక జట్టు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో అగ్ని పరీక్ష ఎదుర్కోనుంది. ఎందుకంటే, ఇప్పటివరకు బ్యాటింగ్ వైఫల్యాలతో కునారిల్లుతోన్న ఢిల్లీ జట్టు నేటి మ్యాచ్ లో 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ మైక్ హసీ (65 నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్ తో రాణించగా.. కెప్టెన్ ధోనీ (44) మెరుపు ఇన్నింగ్స్ తో డెవిల్స్ ను హడలెత్తించాడు. దీంతో, సూపర్ కింగ్స్ కు భారీ స్కోరు సాధ్యమైంది.

More Telugu News