Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పీఆర్‌ కండ్రిగ గ్రామాన్ని సందర్శించిన సచిన్ పిఏ

రాజ్యసభ సభ్యుడు, మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్ దత్తత తీసుకున్న పుట్టంరాజు కండ్రిగ (పీఆర్‌ కండ్రిగ) గ్రామాన్ని శుక్రవారం నాడు ఆయన వ్యక్తిగత సహాయకుడు సందర్శించారు. ఆదివారం సచిన్‌ గ్రామానికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా, సచిన్‌ టెండూల్కర్‌ 15న ముంబై నుంచి చెన్నైకి విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో అదే రోజు సాయంత్రం 5 గంటలకు కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంటారు. అక్కడ కోటి మొక్కల ఉద్యమంలో పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేసి ఆదివారం ఉదయం 8 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా పీఆర్‌ కండ్రిగకు చేరుకుంటారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ ఊర్లోనే సచిన్‌ గడపనున్నారు.

More Telugu News