కర్నూలు జడ్పీ ఛైర్మన్ పై అక్రమ మద్యం కేసు
కర్నూలు జడ్పీ ఛైర్మన్ రాజశేఖర్ గౌడ్ పై అక్రమ మద్యం కేసు నమోదైంది. ఈ నెల 2న జిల్లాలోని ప్యాపిలి మండలం కొత్తకోట సమీపంలో రూ.11 లక్షల విలువైన మద్యాన్ని తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. అది రాజశేఖర్ దేనని తరువాత గుర్తించడంతో ఆయనతో పాటు వ్యక్తిగత సహాయకుడిపై కూడా కేసు నమోదు చేశారు.