ఆహారభద్రత కార్డు, పించన్ కోరుతూ అందిన దరఖాస్తులు కోటీ 18 లక్షలు... నేడే చివరి రోజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆహారభద్రత కార్డు, పించన్ కోరుతూ అందిన దరఖాస్తులు కోటీ 18 లక్షలు... నేడే చివరి రోజు

ఆహార భద్రత కార్డు, పింఛన్ ను కోరుతూ మొత్తం కోటీ 18 లక్షల దరఖాస్తులు తెలంగాణ ప్రభుత్వానికి అందాయి. కాగా, తెలంగాణలో ఈ నెల 9 నుంచి ఆహారభద్రత, పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండగా, వాటి గడువు నేటితో పూర్తికానుంది. ఇప్పటి వరకు ఆహార భద్రత కోసం 83 లక్షలు, పింఛన్ల కోసం 35 లక్షలకు పైగా దరఖాస్తులు అందినట్టు సమాచారం. చివరి రోజు కావడంతో ఈ రోజు మరిన్ని దరఖాస్తులు అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

More Telugu News