తుపాను బాధితులకు యూనినార్ ఉచిత టాక్ టైం
తుపాను బాధితుల సహాయార్థం టెలికాం సంస్థ యూనినార్ తన వంతు సాయం చేస్తోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని ప్రజలు యూనినార్ నెట్ వర్క్ ను ఉపయోగించుకుని ఉచితంగా 5 నిమిషాల పాటు మాట్లాడే అవకాశం కల్పిస్తోంది. నేడు (ఆదివారం) యూనినార్ నుంచి ఏ ఇతర నెట్ వర్క్ కైనా 5 నిమిషాలు ఉచితంగా మాట్లాడుకోవచ్చని యూనినార్ ఏపీ ప్రతినిధి సతీష్ కన్నన్ తెలిపారు.