Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జమ్మూకాశ్మీర్ లో నేటి నుంచి ఈసీ పర్యటన

మూడు వారాల కిందట భారీ వరదలు జమ్మూకాశ్మీర్ ను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా ఆ రాష్ట్రంలో ఈ రోజు ఎన్నికల కమిషన్ బృందం సందర్శించనుంది. అక్కడి పరిస్థితిని సమీక్షించి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే విషయంపై ఓ నిర్ణయానికి రానుంది. ఈసీ టీమ్ లో చీఫ్ కమిషనర్, వీఎస్ సంపత్, కమిషనర్లు హెఎస్ బ్రహ్మ, నసీమ్ జైదీలు రెండు రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. జనవరి 19, 2015కల్లా 87 మంది జమ్మూకాశ్మీర్ ఎమ్మెల్యేల పదవీకాలం ముగియనుంది.

More Telugu News