తిరుమలకు చేరిన ఎన్ డీ ఆర్ఎఫ్ బృందం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమలకు చేరిన ఎన్ డీ ఆర్ఎఫ్ బృందం

తిరుమలకు జాతీయ విపత్తు నిర్వహణ అధారిటీకి చెందిన ఎన్ డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది. బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని దళంను టీటీడీ రప్పించింది. గత ఏడాది కూడా ఎన్ డీఆర్ఎఫ్ దళం తిరుమలలో విధులు నిర్వర్తించింది. 35 మంది సభ్యుల బృందం బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు తిరుమలలో విధులు నిర్వర్తిస్తుంది. ఏదేని విపత్తు తలెత్తే పక్షంలో ఎదుర్కొనేందుకు దళం సిద్ధంగా ఉంటుంది.

More Telugu News