: కసాయి తల్లిదండ్రులు... కొడుకుని లారీ కిందకి తోసేశారు
అనంతపురం కమలానగర్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కొడుకును కడతేర్చి, తల్లిదండ్రులనే పదానికే కళంకం తెచ్చారా దంపతులు. మద్యం మత్తులో భార్యాభర్తల మధ్య మాటా మాటా వచ్చి, అది తీవ్ర ఘర్షణగా మారింది. దాంతో నాలుగేళ్ల వయసున్న శివశంకర్ అనే తమ కొడుకును లారీ కిందకు తోసేశారు. దాంతో ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.