ఉరిశిక్షను రద్దు చేసే ఆలోచన లేదు: హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉరిశిక్షను రద్దు చేసే ఆలోచన లేదు: హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు

ఉరిశిక్షను రద్దుచేసే యోచన ఎన్డీఏ సర్కార్ కు లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. భారతీయ శిక్షాస్మృతి 1860 చట్టం ద్వారా నేరస్థులకు ఉరిశిక్ష విధించే హక్కును కోర్టులు కలిగి ఉన్నాయి. భారతీయ శిక్షాస్మృతి 1860 చట్టాన్ని సవరించే ఉద్దేశ్యం తమకు ఏమాత్రం లేదని ఆయన పేర్కొన్నారు. లా కమిషన్ ఇటీవల తన వెబ్ సైట్ లో ఉరిశిక్షకు సంబంధించి సూచనలు, సలహాలను ,అభిప్రాయాలను అందించవలసిందిగా దేశపౌరులను కోరింది. ఈ నేపథ్యంలో, కేంద్రప్రభుత్వానికి ఉరిశిక్షను రద్దు చేసే ఆలోచన ఉందా? అని పార్లమెంట్ లో మంగళవారం సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వకంగా పై సమాధానం ఇచ్చారు.

More Telugu News