: పాక్ లో సల్మాన్ 'కిక్' థియేటర్ వద్ద బాంబు దాడి
పాకిస్థాన్ లో బాలీవుడ్ సినిమాలకు మంచి ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ నటించిన 'కిక్' సినిమా ప్రస్తుతం అక్కడ భారీ కలెక్షన్లతో దూసుకెళుతోంది. అయితే, కరాచీలో ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న ఓ సినిమా హాల్ వద్ద కొందరు దుండగులు ఓ హ్యాండ్ గ్రెనేడ్ విసిరి పరారయ్యారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాప్రి సినిమా థియేటర్ గేటు వద్ద గ్రెనేడ్ విసిరి వెళ్ళిపోయారని కరాచీ పోలీసు అధికారి ఇమ్రాన్ షౌకత్ తెలిపారు.