అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణం వీహెచ్పీ అజెండా: ప్రవీణ్ తొగాడియా
అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మించడం తమ ప్రధాన అజెండా అని విశ్వ హిందూ పరిషత్ స్పష్టం చేసింది. ఈ మేరకు వీహెచ్పీ నేత ప్రవీణ్ తొగాడియా మాట్లాడుతూ, రామాలయాన్ని నిర్మించడం, లక్షల మంది పేదలకు ఆహారం, యువతకు ఉద్యోగం తమ ప్రధాన లక్ష్యాలని వెల్లడించారు. అయితే, ప్రభుత్వ సహాయం లేకుండానే పేదలకు, యువతకు సహాయం చేస్తామని చెప్పారు.