24న బ్రిజేష్ ట్రైబ్యునల్ భేటీ... హాజరుకానున్న నాలుగు రాష్ట్రాలు
కృష్ణా నదీజలాల పంపిణీ కోసం ఏర్పాటైన జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఈ నెల 24న సమావేశం కానుంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల ప్రతినిధులు హాజరవుతున్నారు. కృష్ణా జలాలకు సంబంధించి తమ తమ వాటాల కోసం ఏపీ, తెలంగాణ ప్రతినిధులు తమ వాదనలను ఈ సమావేశంలో వినిపించనున్నారు.