'పన్నుదొంగ'ల పేర్లు వెల్లడించాలని ఐటీ శాఖ నిర్ణయం
దీర్ఘకాలంగా పన్ను చెల్లించకుండా నెట్టుకొస్తున్న ఎగవేతదారుల పేర్లను వెల్లడించాలని ఆదాయ పన్ను శాఖ భావిస్తోంది. వారి పేర్లను చిరునామాలతో సహా ప్రచురించాలని కూడా ఐటీ శాఖ నిర్ణయించింది. పైగా ఆ జాబితాను ఐటీ శాఖ వెబ్ సైట్లో పెడతారట. ప్రస్తుతం జాబితాను ఖరారు చేసే పనిలో ఆదాయ పన్ను శాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. పదే పదే పన్ను ఎగవేతకు పాల్పడితే మాత్రం ఈ జాబితాకు ఎక్కక తప్పదని ఐటీ శాఖ హెచ్చరిస్తోంది.
ఇటీవలే జరిగిన సీనియర్ అధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ, ఎన్ఐఏలు తమతమ వెబ్ సైట్లలో క్రిమినల్స్ ను వాంటెడ్ లిస్టులో ప్రదర్శిస్తాయని, తాము కూడా అలాగే ప్రదర్శిస్తామని, ఈ చర్య సత్ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నామని ఐటీ అధికారులు అంటున్నారు.