తిరుమలేశుని దర్శనానికి పోటెత్తిన భక్తులు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తుల దివ్య దర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. అద్దె గదులు దొరకక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. శని, ఆదివారాలు వరుస సెలవులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.