వైఎస్సార్సీపీ నేత మృతితో గిద్దలూరులో ఉద్రిక్తత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైఎస్సార్సీపీ నేత మృతితో గిద్దలూరులో ఉద్రిక్తత

వైఎస్సార్సీపీ నేత, ప్రకాశం జిల్లా సహకార సంఘం అధ్యక్షుడు భాస్కరరెడ్డి మృతికి గిద్దలూరు ఎస్ఐ శ్రీనివాస్ కారణమయ్యాడంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు బంద్ కు పిలుపునిచ్చారు. ఎస్సై ఓ పార్కింగ్ స్థల వివాదంలో భాస్కరరెడ్డిని స్టేషన్ కు పిలిపించారు. ఈ క్రమంలో ఎస్సై, భాస్కరరెడ్డి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే, ఉన్నట్టుండి గుండెపోటుతో భాస్కరరెడ్డి కుప్పకూలిపోయారు. ఆయన మృతి చెందడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై జీపును తగలబెట్టారు. ఎస్సై తీరు కారణంగానే భాస్కరరెడ్డి ప్రాణాలు విడిచారని వారు ఆరోపించారు.

కాగా, ఈ స్థలవివాదంలో ఎస్సై శ్రీనివాస్ ఓ మహిళపై చేయిచేసుకోవడంతో సమస్య మొదలైంది. ఈ వివాదం పరిష్కారం కోసమే భాస్కరరెడ్డి స్టేషన్ కు వెళ్ళారు.

More Telugu News