లింగనిర్ధారణ పరీక్షలు చేసిన డాక్టర్ల అరెస్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లింగనిర్ధారణ పరీక్షలు చేసిన డాక్టర్ల అరెస్ట్

నిబంధనలు అతిక్రమించి గర్భిణీలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన ఇద్దరు డాక్టర్లను చంఢీఘడ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హర్యానా నుంచి వచ్చిన డాక్టర్లు చంఢీఘడ్ లోని కొన్ని క్లినిక్ లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారన్న సమాచారంపై పోలీసులు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేశారు. శిశు సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో నిబంధనలు అతిక్రమిస్తున్న ఆసుపత్రులపై పోలీసులు ఈ దాడులు నిర్వహించారు.

మహేందర్ ఘర్ జిల్లాలోని కనీనా గ్రామంలోని సంజీవిని ఆసుపత్రిలో ఒక డాక్టర్ ను అరెస్టు చేయగా, భివానీ జిల్లాలోని ఛర్కీదాద్రీ గ్రామంలోని గుడ్డి క్లినిక్ లో మరొకర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ పరీక్షలకు ఒక్కొక్కరి నుంచి 7,000 రూపాయల చొప్పున డాక్టర్లు వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

More Telugu News