సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ కు వరల్డ్ ప్రైజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ కు వరల్డ్ ప్రైజ్

సుదర్శన్ పట్నాయక్... భారత్ లో పరిచయం అక్కర్లేని కళాకారుడు. ఇసుకతో ఈ ఒడిశా రాష్ట్రీయుడు నిర్మించే కళాకృతులు అంతర్జాతీయంగానూ పేరుగాంచాయి. పట్నాయక్ ప్రతిభకు అమెరికాలో జరుగుతున్న సైకత శిల్ప ప్రపంచకప్ లో 'పీపుల్స్ చాయిస్ అవార్డు' సొంతమైంది. 'సేవ్ ద ట్రీ, సేవ్ ద వరల్డ్' అనే సైకత కళాకృతికి గాను పట్నాయక్ ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. అట్లాంటిక్ సిటీలో ఈ పోటీలు జరుగుతున్నాయి. అవార్డు దక్కిన సందర్భంగా పట్నాయక్ మాట్లాడుతూ, ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన శిల్పాలను మెచ్చి, తనకు ఓటేసి అవార్డు వచ్చేందుకు కారణమైన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News