సంజయ్ గాంధీపై మూడుసార్లు హత్యాయత్నాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సంజయ్ గాంధీపై మూడుసార్లు హత్యాయత్నాలు

దివంగత ప్రధాని ఇందిరాగాంధీ రెండవ కుమారుడు సంజయ్ గాంధీకి సంబంధించి ఒక విషయాన్ని వికిలీక్స్ కేబుళ్లు బయటపెట్టాయి. సంజయ్ 1980లో ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే, అంతకుముందు సంజయ్ పై మూడుసార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయని అమెరికా దౌత్య కార్యాలయం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వికీలీక్స్ ఈ విషయాన్ని వెల్లడించింది.

గుర్తు తెలియని చొరబాటు దారుడు 1976లో సంజయ్ ను చంపడానికి ప్రయత్నించాడట. అలాగే ఎమర్జెన్సీ కాలంలోనూ సంజయ్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. రెండు మూడు సార్లు కాల్పులు జరిపినా స్వల్ప గాయాలతో బయటపడినట్లు భారత ఇంటెలిజెన్స్ అధికారులను ఉటంకిస్తూ అమెరికా సేకరించిన సమాచారం వికీలీక్స్ చేతికి చిక్కింది. నేడు కాంగ్రెస్ సీనియర్ నేతగా కీలక స్థానంలో ఉన్న ఆంటోనీ నాడు సంజయ్ రాజకీయంగా బలపడకుండా అడ్డుకున్నారని ఆయనకు వ్యతిరేకంగా ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపారని వికీలీక్స్ వెల్లడించింది.

More Telugu News