ఇన్నాళ్లూ ఫ్రెండ్స్ కోసం చేశా... ఇకపై అలా చేయను: కరీనా
'ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు స్నేహం కోసం చేశాను. కానీ, ఇప్పటి నుంచి మంచి కథ ఉంటేనే ఆ సినిమాలో నటించేందుకు అంగీకరిస్తా' అని బాలీవుడ్ తార కరీనాకపూర్ చెబుతోంది. అయితే, ఫ్రెండ్స్ కోసం సినిమాలు చేసినందుకు విచారించడం లేదని, అది తప్పేమీ కాదని సమర్థించుకుంది. 'నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోవడానికి చమేలి, దేవ్ చిత్రాల్లో నటించా. నేనేంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. 21 ఏళ్లకే చమేలీలో వేశ్య పాత్ర పోషించాను. తర్వాత తలాష్ లోనూ అలాంటి పాత్రే వేశా. రెండూ నా కెరీర్ లో గొప్ప చిత్రాలు' అని కరీనా తన అభిప్రాయాన్ని తెలియజేసింది.