అనంతపురం ఇక నుంచి 'అనంతపురము'
అనంతపురం జిల్లా పేరును ఇక నుంచి ఇంతకు ముందులా రాస్తామంటే కుదరదండోయ్! ఆ పేరులో కొద్దిపాటి మార్పు చేస్తూ ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వ్యవహారిక భాషలో అనంతపూర్ గా పిలిచే ఈ జిల్లా పేరును ఇక నుంచీ 'అనంతపురము'గా మార్చుతూ నేడు ఉత్తర్వులు జారీ చేశారు. ఉగాది సందర్భంగా రేపు అనంతపురములో జరిగే ఓ కార్యక్రమంలో ఈ మార్పును అధికారికంగా ప్రకటిస్తారని జిల్లా కలెక్టర్ దుర్గాదాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రెవిన్యూ శాఖ మంత్రి రఘవీరా రెడ్డి, ప్రాథమిక విద్య శాఖ మంత్రి శైలజానాథ్ హాజరవుతారు.