చిరంజీవికి తప్పని 'ఇంటి' సెగ!
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి కాంగ్రెస్ మార్కు రాజకీయాలు అనుభవంలోకి వస్తున్నాయి! తన పార్టీ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి అప్పట్లో ఈ జాతీయ పార్టీకి ఆప్తుడిగా మారిన చిరంజీవి.. నేడు వర్గ పోరుకు లక్ష్యంగా మారాడు! ప్రస్తుతం కాంగ్రెస్ లో చిరంజీవికి వ్యతిరేక వర్గం తయారైనట్టు తెలుస్తోంది. అందులో పీసీసీ చీఫ్ బొత్స ఉండడమే ఆసక్తికరం.
కేంద్రంలో పదవి చేపట్టినా, రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేసేందుకు చిరు ప్రయత్నించడం బొత్సకు నచ్చడంలేదని రాజకీయ విశ్లేషకులంటున్నారు. రాబోయే రోజుల్లో సీఎం పదవికి ఇప్పటినుంచే చిరంజీవి రేసులో ఉండడం బొత్స వర్గం జీర్ణించుకోలేకపోతోందని, ఆ క్రమంలో చిరంజీవికి ఎక్కడికక్కడ చెక్ పెట్టాలని సదరు వర్గం నిర్ణయించుకుందని సమాచారం.
ఇటీవల చిరు వర్గానికి చెందిన మంత్రి సి. రామచంద్రయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర కాంగ్రెస్ లో చిరంజీవి ఒక్కరే ఆశాకిరణం అని పేర్కొనగా.. బొత్స వెంటనే ప్రతిస్పందించి, కాంగ్రెస్ లో ఆశాకిరణాలు చాలామందే ఉన్నారని వ్యాఖ్యానించారు. అంతేగాకుండా, ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ అమలు, విద్యుత్ ఛార్జీల తగ్గింపు వంటి అంశాలు తన చలవే అని చిరంజీవి ప్రచారం చేసుకోవడం కూడా బొత్స వర్గాన్ని అసహనానికి గురిచేస్తోంది.
ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చిరుపై విమర్శలకు తెరదీశారు. ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ అంతా తన చలవే అని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఇక పీసీసీ మాజీ చీఫ్ కె. కేశవరావు అయితే ఓ అడుగు ముందుకేసి 'చిరంజీవి ఎవరు?' అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.